Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు బయ్యారం గ్రామ పంచాయతీ సర్పంచ్ ధనసరి కోటమ్మ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఒకేషనల్ కోర్సుల గురించి మహబూబాబాద్ జిల్లా మెంటార్ భూక్య స్రవంతి వివరించారు. వారికి ఉచిత వసతి, శిక్షణ ఇస్తూ ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఒకేషనల్ కోర్సులు బ్యూటీషియన్, టు వీలర్, ఫోర్ వీలర్, ఎలక్ట్రీషియన్, హౌటల్ మేన ేజ్మెం ట్ కోర్సులు ఉన్నాయని వివరించారు. సర్పంచ్ దనసరి కోటమ్మ మా ట్లా డుతూ... ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మరిన్ని ముందుకొచ్చి మండల యు వతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఎన్జీవోస్ సంస్థ సభ్యు డు రాము మాట్లాడుతూ... గత సంస్థలకు భిన్నంగా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్య కమంలో పంచాయతీ కార్యదర్శి మమతా, ఎన్జీవో సంస్థ చెందిన రాము, మండల యువకులు తదితరులు పాల్గొన్నారు.