Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్
నవతెలంగాణ-హన్మకొండ
పిల్లలను చట్టబద్దంగా దత్తత తీసుకోవడం సులువని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ తెలిపారు. విదేశీ దంపతులు దత్తత కోసం పెట్టుకున్న దరఖాస్తు నేపథ్యంలో వారికి హనుమకొండ కంచరకుంటలోని శిశుగృహలో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలికను మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మెన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్‌లతో కలిసి వినరుభాస్కర్ సమక్షంలో సోమవారం దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా వినరుభాస్కర్ మాట్లాడారు. మాతత్వం ఒక వరమని, అందుకు చట్టబద్దమైన దత్తత మార్గమని స్పష్టం చేశారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ ఏ పరిస్థితిలోనూ బాలలను విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. పిల్లలు లేని దంపతులు చట్టబద్దమైన దత్తత కోసం బాలరక్షా భవన్, శిశుగృహ అధికారులను సంప్రదించాలని ప్రజలను కోరారు. జిల్లా సంక్షేమ అధికారి సబిత మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు దత్తత కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని లేదా వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. అనంతరం ప్రత్యేక అవసరాలు కలిగిన బాలికను దత్తత తీసుకున్న అమెరికాకు చెందిన దంపతులను చీఫ్ విప్, మేయర్ అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, బైరి లక్ష్మీ, సీడీపీఓ మధురిమ, జిల్లా బాలరక్షా భవన్ కోఆర్డినేటర్ శిరీష, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సంతోష్‌కుమార్, శిశుగహ మేనేజర్ దూడం నగేష్, సోషల్ వర్కర్ సంగి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.