Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియాకు భారీగా గండి కొడుతున్న వైనం
- జాడ లేని వెహికిల్ ట్రాకింగ్ సిస్టం వాహనాల ఆచూకీ తెలియని దుస్థితి
- నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న కొంత మంది డ్రైవర్లు
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ మహానగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో చెత్త సేకరించి తరలించే క్రమంలో కొంత మంది డ్రైవర్లు వాహనాల్లో సగం వరకే చెత్త నింపుకొని వెళ్తున్నారు. మరికొంత మంది డ్రైవర్లు విధులను సక్రమంగా నిర్వహించడం లేకపోవడంతో బల్దియాకు భారీగా గండి కొడుతున్నారని పలువురు గుసగుసలాడు కొంటున్నారు. బల్దియా పరిధిలో 66 డివిజన్లలో చెత్త తరలింపునకు బల్ది యా వాహనాలు 15 కంపాక్టర్స్, 10 డంపర్ ప్లెజర్స్, 9 టిప్పర్లు, 82 ట్రాక్టర్లు, 313 స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. అందులో రోజువారీగా 2 లేదా 3 ట్రిప్పులు తరలించాలి. ఇది ఇలా ఉంటే, ట్రిప్పులు రాయ డానికి రాంపూర్ డంపింగ్ యార్డ్ వద్ద దాదాపు 10 మంది సిబ్బందిని నియమిం చారు. అందులో కొంత మంది సిబ్బంది మాత్రం సమయం పాటించడం లేదని ఆరోపణలు వెల్లు వేతున్నాయి. కొంత మంది సిబ్బంది మాత్రం రిజిస్ట ర్లో సంతకం బయోమెట్రిక్ హాజరు వేసుకొని వెళ్తారని, వాహనాల నియంత్రించే సిబ్బంది పనితీరు కొరవడిందని చర్చించు కుంటున్నారు. రాంపూర్ డంపింగ్ యార్డ్ వే బ్రిడ్జ్ చిన్నచిన్న సాంకేతిక లోపాలను మరమ్మతులు చేయక పోవడం గమనార్హం. అక్కడి సిబ్బంది ఉదయమే డ్యూటీకి రావాలని వే బ్రిడ్జిని రిపేరుకు గురి చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. అక్కడి సిబ్బంది సక్రమంగా డ్యూటీ చేస్తే వా హనాల పనితీరు మారుతుందని చెత్త వాహనాల్లో లేకుండా మైలేజ్ కోసం వాహనాన్ని నగరాన్ని చుట్టేస్తున్నారని కొంత మంది డ్రైవర్లకు, సానిటరీ ఇన్స్పెక్టర్లు సహకరిస్తున్నారని, ఆందుకే బహిర్గతంగా తెలిసిన ఎలాంటి చర్యలు లేవని ఏ అధికారి ఇంతవరకు మందలించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా బల్దియా ప్రజా ఆరోగ్య అధికారులు దృష్టి సారించి, విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బంది పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.