Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
సమగ్ర గిరిజనాభివద్ధి సంస్థ పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన గిరిజన దర్భార్‌లో వినతులను గిరిజనులు ఐటీడీఏ పీవో అంకిత్‌కు అందజేశారు. వారసత్వం కింద ఆర్ఓఎఫ్ఆర్ పట్టా చేయాలని మంగపేట మండలం నీమ్మగూడెం గ్రామానికి చెందిన మద్దెల పాపారావు పీఓకు విన్నవించారు. చుంచుపల్లి పాఠశాలలో పీడీ లేక పీఈటీగా ఉద్యోగం ఇప్పించాలని మంగపేట గ్రామానికి చెందిన గట్టి స్వరూప మొర పెట్టుకున్నారు. ఈఎస్ఎస్ ట్క్రెకార్ రుణాన్ని మంజూరు చేయాలని కొత్తగూడ మండలానికి చెందిన బోడ శ్రీను, మాలోతు సదన్లాల్ కోరారు. మహ బూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామానికి చెందిన 46 మందికి ఈఎస్ఎస్ రుణాలు మంజూరు అయ్యాయని, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రుణాలు అందడం లేదని కొత్తెం సమ్మయ్య, గుగులోతు బాలు, పాల్తియా క్రాంతిలు పీఓకు గోడు వెల్లబోసు కున్నారు. కులంతార వివాహాం చేసుకున్నామని, ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు మంజూరు చేసిన రుణాన్ని గ్రౌండింగ్ చేయించాలని మంగపేట మండలం నర్సపురం గ్రామానికి చెందిన కొమ్ము బాబు, కోరు కవిత పీఓకు మొర పెట్టుకున్నారు. సీజనల్ వ్యాధులపై గ్రామీణ ప్రాం తాల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత నిర్వహిం చడానికి అనుమతి ఇప్పించాలని తాడ్వాయికు చెందిన ఇర్ప జగన్ కోరారు. ఏటూరునాగారం మం డలంలోని గంటలకుంట గొత్తికోయగూడేనికి విద్యుత్, తాగునీటి సౌకర్యం ఇప్పించాలని గొత్తికోయలు భద్రయ్య, మడవి నగేష్, నందు పీఓను కోరారు. గిరిజన ఆశ్రమ పాఠ శాలలో జీఎన్ఎం ఉద్యోగం ఇప్పించాలని వాజేడు మం డలం గుమ్మడిదొడ్డికి చెందిన జెజ్జరి మమత విన్నించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వెంకటాపురం(కె), తాడ్వాయి, ఏటూరు నాగారం మండలాలకు చెందిన పలువురు గిరిజనులు పీకు వినతి పత్రాలను అందజేశారు. విన తులను పరిశీలించిన పీఓ ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమం లో ఏపీఓ వసంతరావు పాల్గొన్నారు.