Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి,
- సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య కరపత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 8న జిల్లా కలెక్టరేట్ ఎదుట తల పెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ కోరారు. ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను హనుమకొండ రాం నగర్లోని సుందరయ్య భవన్లో సంఘ కార్యాల యంలో సోమవారం వారు ఆవిష్కరించి మాటా ్లడారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు జీఓ నెం బర్ 190 ప్రకారం రూ.2-12 లక్షల వరకు రజక పెరేషన్ ద్వారా రుణాలిస్తామని వాగ్ధానం చేయగా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మంది దరఖాస్తులు చేయగా కేవలం 5 వేల మందికి మాత్రమే రుణా లిచ్చి మిగతా వారిని ప్రభుత్వం విస్మరించిందని విమ ర్శించారు. ప్రభుత్వ స్థలాల్లో మాడ్రన్ దోబీ ఘాట్లు నిర్మిస్తామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో, విద్యాసంస్థలో పనుల కాంట్రాక్టును రజకులకు ఇస్తామని, పింఛన్, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను అమలు కాలేదని విమర్శించారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించిన ఉచిత విద్యుత్తు పథకం కింద కొత్త మీటర్ల కోసం దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8న కలెక్టరేట్ ఎదుట ధర్నా తలపెట్టినట్టు తెలిపారు. రజక వృత్తిదారులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వత్తిసంఘాల జిల్లా కన్వీనర్ కె లింగయ్య, సంఘాల జిల్లా నాయ కులు గొడుగు వెంకట్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ కంచర్ల కుమారస్వామి, నాయకులు కల్లేపల్లి బాబు, మాడరాజు రమాదేవి, విజరు, నెల్లుట్ల స్వప్న, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.