Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మె సోమవారం 8వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు కెవిపిఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సం దర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పొడేటి దయాకర్ సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ధర్నాలు రాస్తా రోకోలు సమ్మెలు చెయ్యరని తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ మాటలు నీటి మూటల య్యాయని అన్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు జేరిపోతుల భాస్కర్, వీఆర్ఏ మండల జేఏసీ జిల్లా కన్వీనర్ డి.రాజు, మండల అధ్యక్షులు పి రమేష్, ఉపాధ్యక్షులు ఏ. విజేందర్, కార్యదర్శి టి.కొమురయ్య, సహాయ కార్యదర్శి సిహెచ్. రాజు, కోశాధికారి ఎన్ వీరేష్, పి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వర్షంలోనే వంటా వార్పు
సంగెం : సీఎం ఇచ్చిన పే స్కేల్ హామీని నెరవేర్చాలని వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వంటా వా ర్పు కార్యక్రమం చేపట్టారు. మండలంలో భారీ వర్షం లోనే ఈ వంటావార్పు కార్యక్రమాన్ని వీఆర్ఏ లు చేపట్టి టెంటు కిందనే భోజనాలు చేసారు. సమ్మెలో మాజీ ఎంపీపీ బొమ్మల కట్టయ్య పాల్గొని సాంఘి భావాన్ని తెలిపారు. కార్యక్రమం లో మండల జాక్ చైర్మన్ జీజుల సత్యదేవ్, కో చైర్మన్ ఆకుల ప్రవీణ్, కన్వీనర్లు బోగి లింగం, గొర్రె రఘు నందన్, రజిత, సుధాకర్, యాకయ్య, శ్వేత, శంకర్, వేణు, వీఆర్ఏ లు పాల్గొన్నారు.
మంగపేట : తమ డిమాండ్ల సాధనకు రెవెన్యూ కార్యాలయం వద్ద 8 రోజులుగా నిరవదిక నిరసనలు చేస్తున్న వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షుడు మైల జయరాం రెడ్డి, ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీగొండ కాంతారావు, ఉపాధ్యక్షుడు తూడి భగవాన్‌రెడ్డి, ప్రధాన కార్య దర్శి అయ్యోరి యానయ్య, అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, ముత్తినేని ఆదినారా యణ, టీవీ. హిదాయతుల్లా, బానుచందర్, రమేష్, ముకుందం, వెంకటేశ్వర్లు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
రాయపర్తి : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టగా సోమవారం 8వ రోజు కు చేరింది. మండల రేషన్ డీలర్ల సంఘం వారికి మద్దతు తెలిపింది. కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసి మండల చైర్మన్ నాగుల రాంమ్మూర్తి, డీలర్లు భాస్కర్, పంచాక్షరీ, సోమయ్య, లింగయ్య, వీఆర్ఏలు పాల్గొన్నారు.
తాడ్వాయి : మండల కేంద్రంలో జరిగే సమ్మె 8వ రోజు తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు గౌరబోయిన మో హన్‌రావు, కార్యదర్శి కొప్పుల జగన్ సంఘీభావం తెలిపారు. వంట వార్పు నిర్వహించి, భోజనం చేసి, వినూత్న నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు సాయిరి శ్రీను, వీఆర్ఏలు పాల్గొన్నారు.