Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోరీలకు పాల్పడితే సహించేది లేదు
- వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్
- రాయపర్తి పోలీస్ సిబ్బందికి అభినందనల వెల్లువ
నవతెలంగాణ-రాయపర్తి
సెల్ టవర్స్ 4 జీ నోట్స్ లను దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వర్ధన్నపేట సిఐ సదన్‌కుమార్, ఎస్సై బండారి రాజు నేతృత్వంలో రాయపర్తి పోలీస్ సిబ్బంది దొం గల ముఠాను పట్టుకున్న ఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. అనంతరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా ఏసీపీ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా తిర్మలాయపల్లి మండలం సోలిపురం గ్రామం హలవత్ తండాకు చెందిన బానోత్ సేవ, హలవత్ సోమ్ల, నునవత్ అశోక్ స్నేహితులు. సోమ్ల, సేవ టెలికం ఎన్టీఎస్ కాంట్రాక్టర్ వద్ద జాబ్ చేసేవాడు. కొంతకాలం తర్వాత అందులో ప్రావీణ్యం పొందిన తరువాత సబ్ కాంట్రాక్టర్‌గా చేశాడు. సేవ, సోమ్ల, అశోక్ కారు తీసు కొని సెల్ టవర్లు వద్ద రెక్కీ చేపట్టి అదును చూసి 4 జీ నోట్స్‌లను దొంగిలించేవారు. ఈ క్రమంలో రాయపర్తి మం డలం మైలారం గ్రామ శివారు ఎయిర్టెల్ టవర్‌లో ఆరు లక్షల విలువైన 4జీ నోట్స్‌లను దొగించారు. వాటిని ఉత్తర ప్రదేశ్ ముజఫర్ ప్రాంతానికి చెందిన మొహారం, అస్లాం హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో గోదాం లీజుకు తీసుకొని ఇలాటి దొంగ సొత్తును కొనుగోలు చేసి వాటిని వి డి భాగాలుగా చేసి ఇతరులకు విక్రయిస్తున్నారు. వీరు కూడా దొంగిలించిన 4 జీ నోట్స్ లను మొహారం, అస్లాంలకు విక్రయించారు. బుధవారం మండలకేంద్రంలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదగా ఉన్న సోమ్ల, సేవ, అశోక్, అస్లాం పట్టు కుని అరెస్ట్ చేశారు. మొహరం పరారీలో ఉన్నట్లు వివరిం చారు. దొంగలను పట్టుకోవడంలో ప్రత్యేక ప్రతిభ కనబ రిచిన కానిస్టేబుళ్లు చిదులరా రమేష్, బొట్ల రాజుకు అభి నందించారు తెలిపారు. వీరికి రివాడ్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.సమావేశంలో పోలీస్ సిబ్బంది ఎల్లయ్య, నర్సిం గ్రావు, సంపత్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.