Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
నగరంలోని 49 డివిజన్లలో ఏర్పాటు చేస్తున్న పార్కులను ప్రారంభానికి సిద్ధం చేయాలని జిడ బ్ల్యూ ఎంసీ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదే శించారు. బుధవారం బల్దియా పరిధిలోని 49వ డివిజన్లో కొనసాగుతున్న మిలీనియం పార్క్ ప్రగతినగర్ పార్కుల పనులను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. సివిల్ వర్క్ పూర్తయిందని, ఇం కనూ అసంపూర్తిగా ఉన్న గ్రీనరీ తదితర పనులను తక్షణమే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం 57వ డివిజన్లోని వాజ్ పేయి కాలనీ లో నిర్మిస్తున్న మోడల్ వైకుంఠధామం పనులను ఆమె పరిశీలించి పనుల్లో వేగం పెంచి ఈనెల 31లోగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అంతకుముందు 49వ డివిజన్ లోని ఎస్బిహెచ్ కాలనీ ప్రాంతంలో నిలిచి ఉన్న వరద నీటిని పరిశీలించి, వరద నీరు నిల్వ ఉండకుండా పారద్రోలేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఎగ్జిక్యూ ట ివ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, డీఈలు రవికుమార్, సం తోష్ బాబు, ఏ ఈ అరవిందా ఉన్నారు.