Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మామునూరు ఏసీపీ నరేష్ కుమార్
నవతెలంగాణ-సంగెం
విద్యార్థులు సైబర్ నేరాలకు, దురల వాట్ల కు దూరంగా ఉండాలని మామునూరు ఏసిపి నరేష్ కుమార్ అన్నారు. బుధవారం మొం డ్రాయి హైస్కూల్లో విద్యార్థిని, విద్యా ర్థులకు స్కూల్ చిల్డ్రన్ అవేర్నెస్ ప్రోగ్రాం స్థానిక ఎస్సై బి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడుతూ స్కూల్ పిల్లలు మొబైల్ వాడకాన్ని తగ్గిం చాలని దానిలో మంచి కార్యక్రమాలను మాత్రమే స్వీకరించే విధంగా తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల ని ఘా పెంచాలని అన్నారు. సైబర్ క్రైమ్ నేరాల గురించి డయల్ 100 దానిపైన అవగాహన, ప్రాముఖ్యత, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి, బాల్య వివాహాల గురించి, రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్, హెల్మెట్ వాడకం, దానివల్ల ఉపయోగాలు విద్యార్థులకు వివరించారు.కార్యక్రమంలో పర్వతగిరి సీఐ శ్రీని వాస్, ప్రధానోపాధ్యాయురాలు విజయ, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.