Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె.శశాంక
నవతెలంగాణ-మహబూబాబాద్
హాస్టల్లో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి జిల్లాలోని వసతి గృహాల్లో గత మూడు, నాలుగు రోజుల్లో ప్రత్యేక అధికారులు చేసిన తనిఖీ సందర్భంలో వసతి గృహాలలో గమనించిన భోజన, వసతి సౌకర్యాలలో నెల కొని ఉన్న సమస్యలు, పరిష్కారంపై అధికారులతో సమీక్షిం చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 121 హాస్టల్లలో 200 మందికి పైగా ఉన్న హాస్టల్ లలో గుర్తిం చిన సమస్యలపై ఈ రోజు సమీక్షించారు. గుర్తించిన సమస్యలు మళ్ళీ రాకుండా, పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని, స్థానికంగా ఉండని, పని చేయని వారిపై ఇకముందు చర్యలు తప్పవని, మరో మారు అదే తీరు కన బర్చితే, మార్పు లేకుంటే చర్యలు తీసుకోవడం జరుగు తుందని తెలిపారు.పిల్లలకు తగ్గట్లుగా సిబ్బంది ఉండాలని, వార్డెన్ లేని చోట అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుండి సిబ్బందిని కేటాయించాలని, ఫుల్ టైం వార్డెన్ ఉండాలని, టెండర్ ప్రకారం, అగ్రిమెంట్ ప్రకారం ఏజెన్సీ వారు సామా న్లు అందిస్తున్నార లేదా చూడాలని, అందించకపోతే చర్య లు తీసుకోవాలని, హై జీన్ ఫుడ్ అందించాలని, త్రాగునీటి మిషన్ భగీరథ, ఆర్. ఓ. ప్లాంట్ నుండి అందించాలని, మిషన్ భగీరథ నీటిని వాడే విధంగా చూడాలని, నాణ్య మైన వస్తువులు వాడే విధంగా, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని, టాయ్‌లెట్ లలో రన్నింగ్ వాటర్ అందుబాటులో ఉండాలని, ఇక ముందు తనిఖీ సమయంలో ఎలాంటి లోపాలు కనిపించరాదని తెలిపారు. హాస్టల్లకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉన్నదని, ఇకముందు తనిఖీ చేసిన సందర్భాల్లో గుర్తించిన సమస్యలు వెంట వెంటనే తెలపాలని సూచించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ నుండి కిచెన్ షెడ్‌కు, డైనింగ్ హాల్ వరకు బ్యాటరీ ట్యాప్ ఏర్పాటు చేసి అందించాలని తెలిపారు.