Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసిల్దార్ కు ఎమ్మార్పీఎస్ వినతి
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న లోతట్టు ప్రాంత ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని మాదిగ రాజకీయ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నాయకులు వరంగల్ తహసిల్దార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం తహసిల్దార్ సత్యపాల్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మాదిగ రాజకీయ పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సింగారపు చిరంజీవి మాట్లాడుతూ గత 20 రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాల వలన వరంగల్ మండల పరిధిలోని ఎంహెచ్ నగర్, తుమ్మలకుంట, శాంతినగర్, ఎస్సార్ నగర్, బాలాజీ నగర్, వివేకానంద కాలనీ, సుందరయ్య నగర్, మండి బజార్ లతోపాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని అన్నారు. ఆయా ప్రాం తాల్లో నివసించే పేద మధ్యతరగతి కుటుంబాల ఇండ్లు పూర్తిగా కూలిపోవడంతో పాటు అక్కడక్కడ పాక్షికంగా ధ్వంసం అయ్యాయని అన్నారు. ముం పుకు గురైన ప్రాంతాలను అధికారులు సందర్శించి నిరశ్రయులైన పేదలను గుర్తించి ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నారపు రవి, హనుమకొండ జిల్లా ప్రధాన కార్య దర్శి జెరిపోతుల విల్సన్, వరంగల్ జిల్లా ఉపా ధ్యక్షు డు పెండ్యాల స్వరాజ్, కాజీపేట మండల అధ్యక్షుడు శనిగరపు లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.