Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ టీచ ర్స్ కార్యదర్శి చింతల సురేష్ సేవలు అభినందనీయమని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య అన్నారు. సురేష్, జాన్ బన్నీ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ టీచర్స్ ఆధ్వర్యంలో చిట్యాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ. 15 వేలు విలువ చేసే స్టడీ మెటీరియల్, పుస్తక సామాగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ప్రధా నోపాధ్యాయుడు వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమా వేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సేవా దక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు సహకారం అందించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలను ఎంపీపీ తనిఖీ చేసి, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజ నం చేశారు. సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు రాయపెల్లి యాకయ్య ధారవత్ కిషన్ నాయక్, హెచ్ఎం నరేష్, కార్యదర్శి రాజు, వెలిదే సురేష్, కొండం నరసింహ రెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
రోగులకు పండ్ల పంపిణీ
తొర్రూరు :డాక్టర్ కేసీ జాన్ బన్నీ జన్మదిన సందర్బంగా లయన్స్ క్లబ్ రీజియన్ కార్యదర్శి దామెర సరేష్ వివిధ ఆస్పత్రులలో రోగులకు బుధవారం పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయం చేయాలని, తమ తమ పుట్టినరోజున, వివాహ వార్షికోత్సవ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ రక్షణ కు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాదారపు వేణుగోపాల్, సెక్రటరీ నాళ్ళ కృష్ణమూర్తి, ట్రెజరర్ తమ్మీ రమేష్, క్లబ్ సభ్యులు డాక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.