Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రతి డాక్టర్ పి.ఎన్.డి.టి చట్టం, ఎంటిపి చట్టం నిబంధనలు కచ్చితంగా పాటించాలని హనుమకొండ డీఎం హెచ్ఓ డాక్టర్ బి సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించిన పి.ఎన్.డి.టి జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. పి.ఎన్.డి.టికి సంబంధించి అను మతి, రెన్యువల్, డాక్టర్ల మార్పులు, చేర్పులు, అడ్రస్ మార్పు, స్కానింగ్ మెషిన్ మార్చడం, కొత్తగా కొనుగోలు చేయడం అన్ని ఆన్ లైన్ లోనే దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఏ డాక్టర్ కైతే అనుమతిని ఇవ్వడం జరుగుతుందో వారే స్కానింగ్ నిర్వహించాలన్నారు. స్కానింగ్ చేసిన ప్రతి గర్భిణీ స్త్రీకి సంబంధించిన వివరాలను నమోదు చేసి రికార్డులను మూడు సంవత్సరాలు భద్రపరచాలి అన్నారు. అలాగే ఎంటిపి చట్టం కింద అనుమతి పొందిన ఆసుపత్రులు ఖచ్చితంగా నియమాలకు అనుగుణంగా అనుమతించిన పరిస్థితుల్లో మాత్రమే అబార్షన్లు నిర్వహించాలని పూర్తి వివ రాలను నమోదు చేయాలన్నారు. స్వంత వైద్యం, అర్హతలేని వైద్యుల దగ్గరకు వెళ్లకుండా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి హనుమకొండలో నిపుణులను సంప్రదిం చాలన్నారు. చట్టం ఉల్లంఘిస్తున్న వారి వివరాలు 104,1098 లేదా డయల్ 100 కి తెలియచేయాలన్నారు.ఈ సమావేశంలో డి ఎం హెచ్ ఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్. ఎండి. యాకూబ్ పాషా, గైనకాలజిస్ట్ లు డాక్టర్.వై. పద్మ,డాక్టర్.ఏ.నిరంజని దేవి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్. కల్యాణి, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్ రెడ్డి, సర్వోదయ సేవ సమితి నుండి శ్రీ. ఎస్.కవి రాజ్, శ్రీకాంత్, డిప్యూటీ డెమో కె. ప్రసాద్ లు పాల్గొన్నారు.