Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదేళ్ల బాలుడికి నరాల బలహీనత, ఊపిరితిత్తుల వ్యాధి
- వైద్యానికి లక్షల్లో ఖర్చు
- దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు
నవతెలంగాణ-దుగ్గొండి
ముక్కు పచ్చలారని ఓ పసి ప్రాణం మత్యువుతో పోరాడుతోంది. పదేళ్ల వయసులోనే నరాల బలహీనత, ఊపిరితిత్తుల వ్యాధి సోకడంతో శరీరంలోని ఏ అవయం సరిగా పని చేయకపోవడంతో చిన్నారి ప్రాణం విలవి ల్లాడిపోతోంది. నోరు తెరిచి చెప్పలేని ఆ పసి బాలుని బా ధ అంతా ఇంతా కాదు. ఆ పసిమొగ్గ ప్రాణాలు నిలి పేం దుకు దాతలు ముందుకు రావాలని తల్లిదండ్రులు ఆర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
మండలం తిమ్మంపేటకు చెందిన శారద, ప్రకాష్ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితి. ఈ క్రమంలో వీరి మొదటి సంతానమైన కోట వర్షిత్ (10) నరాల బలహీనత, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం బంధువుల దగ్గర రూ.6లక్షల అప్పు చేసి చికిత్స చేయించారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో కుటుంబ పరిస్థితులు బాగా లేనందున, పేదరికం అడ్డు రావడంతో హైదరాబాదులోని గాంధీ ఆస్పత్రికి తీసు కెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడికి నరాల బలహీనత, ఊపిరితిత్తుల వ్యాధి ఉందని నిర్ధారిం చారు. నరాల బలహీనత వల్ల శరీరంలోని ఏ భాగాలు పనిచేయడం లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి రెక్కల కష్టం మీద ఆధారపడ్డ ఈ కుటుంబానికి, చిన్నారికి వైద్యం చేయించుకునే స్తోమత లేదు. దీంతోఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దాతల సహా యం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. సాయం చేయాలనుకునే వారు 9391900935 ఫోన్‌కి ఫోన్‌పే ద్వారా గాని, గూగుల్ పే ద్వారా గానీ ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నారు.