Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ సరోజిని దేవి
నవతెలంగాణ-ములుగు
ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను పాఠశాల స్థాయిలో విద్యార్థులకు చేరే విధంగా చూడాలని మోడల్ స్కూల్స్ జాయింట్ డైరె క్టర్ సరోజినీ దేవి తెలిపారు. ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటువంటి తొలిమెట్టు కార్యక్రమ రాష్ట్ర పరిశీలకులుగా సరోజినీ దేవి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వెంకటాపూర్, ములుగు, గోవిందరావుపేట మండలాల్లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఉపాధ్యాయుడు తమ వంతు కషి చేయాలని ఆమె కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహణ తీరును పరిశీలించుటకు కాంప్లెక్స్, మండల, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పరిశీలకులు పాఠశాలలను సందర్శిస్తారు. ప్రతి నెల కార్యక్రమం నిర్వహణపై సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా, రాష్ట్ర అధికా రులు తరచుగా పాఠశాలలను సందర్శిస్తారని తెలిపారు. ఆమెవెంట డీఈఓ కార్యాలయ క్వాలిటీ కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, ములుగు ఎంఈవో సామల శ్రీనివాసులు, రిసోర్స్ పర్సన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.