Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ
నవతెలంగాణ-మట్టెవాడ
పల్లె, పట్టణ ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించడానికి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని వరం గల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన కాంప్రెన్సివ్ హెల్త్ కేర్ సిస్టం శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు ప్రజలకు సేవ చేయ డం అదష్టంగా భావించాలని, శిక్షణ అనంతరం ఫీల్డ్ లెవల్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ మంచి ఫలితాలు రాబట్టాలని కోరారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ గోపాల్రావు, పిఓడిటిడి డాక్ట ర్ సుమంత్ లు సంక్రమిత, అసంక్రమిత వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ,వివిధ అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పి స్తూ వారికి సరైన వైద్య సేవలు అందించడానికి శిక్ష ణలో సులభ మార్గాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీపీవో అర్చన, ఆరోగ్య పర్యవే క్ష కులు ప్రకాశ్ రెడ్డి, డిడిఎం నితిన్ రెడ్డి, పాల్గొన్నారు.