Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హనుమకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని హనుమకొండ, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహెందర్‌రెడ్డి అధ్యక్షతన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి రాజేందర్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సాగిస్తున్న మోసపూరిత పాలన పట్ల ప్రజలు విసుగు చెంది తిరిగి కాంగ్రేస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. కార్యక్రమంలో 66వ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళఙ్లపెల్లి తిరుపతి, 66వ డినిజన్ కార్పొరేటర్ కాంటెస్ట్ అభ్యర్థి నన్నెంశెట్టి స్వామి, కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టే శ్రీనివాస్‌రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు సౌరం చరణ్ తేజ్, డివిజన్ యూత్ అధ్యక్షుడు తాళ్ల మధు, మాజీ దేవస్థాన చైర్మన్ జన్ను రవీందర్, వర్ధన్నపేట నియోజక అధ్యక్షుడు కొమ్ము రమేష్, మండల ఉపాధ్యక్షులు అజ్మీరా రమేష్, మాజీ ఉపసర్పంచ్ బల్సుకూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.