Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం
- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ-పెద్దవంగర
కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ, అబివృద్ధి పథకాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు, ఉప్పరగూడెం గ్రామాల్లో ఎంపీపీ ఈదు రు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి తో కలిసి పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుం దన్నారు. మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో మంత్రి పాల్గొని, తల్లిపాల విశిష్ఠతను వివరించారు. పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు పట్టించాలన్నారు. ఉప్పె రగూడెం గ్రామంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. మంత్రి ధ్వజ స్తంభానికి నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆ దేవుడి కృపకటాక్షాలు అందరిపైనా ఉండాలని కోరుకున్నారు. సీఎం కేసిఆర్ నేతత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, భవిష్యత్తులో సీఎం నాయక త్వంలో తెలంగాణ బంగారు మయం కావాలని మంత్రి కోరు కున్నారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వెనకదాసుల రామ చంద్రయ్య, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సర్పంచ్ లు వెనకదాసుల లక్ష్మీ శర్మ, దుంపల జమున సమ్మయ్య, మండల ప్రత్యేక అధికారి ఖుర్షీద్, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, నాయకులు సుధీర్, సంజయ్, లింగమూర్తి, శ్రీనివాస్, వేణు, వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.