Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
ప్రియుడి చేతిలో మోసపోయిన చొక్కం రమ్యకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య తెలిపారు. మండల కేంద్రంలోని రమ్య ప్రియుడు సందీప్ ఇంటి ఎదుట రమ్య చేపట్టిన మౌన దీక్షను ఐద్వా బృందం బుధవారం సందర్శించింది. బాధిత రమ్యతో వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం అహల్య మాట్లాడారు. ప్రియుడు మోసగించగా పోలీసులను బాధితురాలు ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో దీక్ష చేపట్టాల్సి వచ్చిందన్నారు. రాజకీయ పలుకుబడితో రమ్యను మోసం చేయాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షడిగా వ్యవహరిస్తున్న యువడి తండ్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ దైద రాములమ్మ, గడ్డం స్వరూప, తదితరులు పాల్గొన్నారు.