Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్పై పోరాటం అబద్దం
- కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండి
- ఈ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు
- కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీ య నేత, ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్య కర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడుతూ తెలంగాణ కోసం కొట్లాడతాం అని చెప్పుకునే కొందరు ముసుగు వీరులు తమ ఆర్థిక లావాదేవీల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనే అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను అడుగు అడుగున అడ్డు తగిలిన బీజీపీ పంచన చేరుతున్న రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని, పార్టీ కార్యకర్తలను విమర్శించే అర్హత లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని మునుగోడు కు రావాల్సింది ఉప ఎన్నిక కాదని, అబివృద్ధికి నిధులు మాత్రమే అని బీజీపీ ప్రభుత్వం ఈడిని మోడీ తన జేబులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేపిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని సీతక్క అన్నారు. కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేం దర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి బాగ్ వాన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, బండి శ్రీనివాస్, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.