Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్ట్ 15న పెన్షనర్లకు మంజూరీ పత్రాలిస్తాం
- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
ముందస్తు ఎన్నికలకు పోయే ప్రసక్తే లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తర్వాతే ఎన్నికలకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ఎన్నికల నాటికి దళితులందరికీ న్యాయం చేస్తామని, లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు. గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులకు దళితబంధు పథకంలో అవకాశం లేదని తేటతెల్లం చేశారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈనెల 15న మంజూరీ పత్రాలు అంద జేస్తామని చెప్పారు. 57 ఏండ్లు నిండి దరఖాస్తు చేసుకోని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పాలకుర్తి, చెన్నూర్, ఉప్పుగల్లు రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడంతో ఆ కాంట్రాక్టర్‌ను మార్చామన్నారు. సమావేశంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముస్కు రాంబాబు, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పుస్కూరి శ్రీనివాస రావు, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ రాఘవరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గుగ్గిళ్ల యాకయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఉపసర్పంచ్‌ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, ముది రాజ్ మహాసభ నియోజకవర్గ కన్వీనర్ రాములు, తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలకు చీరలు పంపిణీ
తన క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మంత్రి దయాకర్ రావు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. వికలాంగు లకు పోషకాహార కిట్లు అందజేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గూడూరు రాంరెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి జయంతి, ఎంపీడీఓ వనపర్తి అశోక్‌కుమార్, కొడకండ్ల ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ సతమ్మ తదితరులు పాల్గొన్నారు.
దర్దేపల్లి ఆలయంలో పూజలు
మండలంలోని దర్దేపల్లిలోని పెద్దమ్మ ఆలయంలో మంత్రి దయాకర్‌రావు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాలు సమద్ధిగా కురవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, గ్రామస్తులు అంజయ్య పాల్గొన్నారు.