Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
రైతులు పంట భూముల్లో ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ జీలుగ, పచ్చిరొట్ట, పిల్లి పెసర పంటలను దుక్కిలో దున్ని పెట్టుబడిని ఆదా చేసుకోవాలని డీఏఓ విజరుభాస్కర్, ఏడీఏ నర్సింగం సూచించారు. మండలంలోని దమ్మన్నపేటలో చుక్క ప్రభాకర్ గౌడ్ వేసిన జీలుగ పంటను గురువారం వారు సందర్శించి మాట్లాడారు. జీలుగ, పచ్చిరొట్ట, పిల్లి పెసరను దుక్కిలో కలియ దున్నడం వల్ల నేల సారవంతమై ఎరువుగా మారుతుందని తెలిపారు. అధికంగా ఎరువుల వాడకం వల్ల నేలల్లో సారవంతం, దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నారు. పూత దశలో దున్నితే రైతులు ఆశించిన దిగుబడులు వస్తాయని తెలిపారు. నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ వాసుదేవరెడ్డి, ఏఈఓలు ప్రశాంత్, రణధీర్, సర్పంచ్ నడిపెల్లి శ్రీనివాస్‌రావు, రైతులు కుమారస్వామి, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల షాపుల్లో తనిఖీ
మండలంలోని ఎరువుల షాపులను డీఏఓ విజరుభాస్కర్, ఏడీఏ నర్సింగం తనిఖీ చేశారు. షాపుల్లోని రికార్డులను పరిశీలించారు. ఎరువులు కొనేప్పుడు ఆధార్ కార్డు నంబర్‌తో ఈ-పాస్ మిషన్‌లో పేరు నమోదు చేసుకొని రశీదు తీసుకోవాలని రైతులకు సుచించారు. డీలర్లు ఈ-పాస్ మిషన్ స్టాక్, నిల్వలు ఒకేలా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.