Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భం గా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా 'స్వతంత్ర భారత వజ్రోత్సవాలను' రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తోందని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతిఒక్కరూ ఈనెల 8 నుంచి 22 వరకు స్వాతంత్ర ఉత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. వజ్రోత్సవ కార్యక్రమాలను వెల్లడించారు. ఈనెల 8న ప్రారంభ సమారోహం, 9న ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం, 10న వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్క్‌ల ఏర్పాటు, 11న ఫ్రీడం రన్ నిర్వహణ, 12న రాఖీ సందర్భంగా మీడియా సంస్థల ద్వారా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రచారం, 13న విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సామాజిక వర్గాలతో వజ్రోత్సవ ర్యాలీలు, 14న సాయంత్రం సాంస్కతిక సారధి కళాకారుల చేత నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్కతిక, జానపద కార్యక్రమాలు, ప్రత్యేకంగా పటాకులతో వెలుగులు నింపడం, 15న స్వాతంత్య్ర దిన వేడుకలు, ఇంటింటా జెండావిష్కరణలు ఉంటాయని వివరించారు. అలాగే 16న ఏకకాలంలో ఎక్కడి వారక్కడ సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరా నిర్వహణ, 17న రక్తదాన శిబిరాలు, 18 ఫ్రీడమ్ కప్ పేరుతో క్రీడలు, 19న దవాఖానలు, అనాధ శరణాలయాలు, వద్ధాశ్రమాలు, జైళ్లల్లో పండ్లు, స్వీట్ల పంపిణీ, 20న దేశభక్తి, జాతీయ స్ఫూర్తి చాటేలా ముగ్గుల పోటీలు, 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం, 22న ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేష్, ఏఎస్పీ అశోక్ కుమార్, డీఆర్మో రమాదేవి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, డీపీఓ వెంకయ్య, డీఆర్డీఓ నాగ పద్మజ, డీవైఎస్ఓ వెంకటరమణ చారి, డిప్యూటీ సీఈఓ రమాదేవి, ఏఈఈ రాకేష్, జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, డీపీఆర్వో రఫీక్ పాల్గొన్నారు.