Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
- కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె
నవతెలంగాణ-కాజీపేట
సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన సమ్మెను పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. అనంతరం చక్రపాణి మాట్లాడారు. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను విస్మరించి మోసపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఐక్యపోరాటాలతోనే సమస్యలు పరిష్కారమౌతాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ కార్యదర్శి తొట్టే మల్లేశం, నాయకులు గడ్డం అశోక్, ఒస్కుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట : తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షల సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు నాలికె మహేందర్ మాట్లాడారు. దీక్షలో వీఆర్ఏలు సురేష్, రమేష్, రాజు, శ్రీను, రవి వర్మ, సజన, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.
టేకుమట్ల : వీఆర్ఏలు సమ్మె సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అంఆదించారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి స్వామి, జిల్లా జాయింట్ సెక్రెటరీ రవీందర్, వీఆర్ఏలు అప్సర, రజిత, కిరణ్మయి, మౌనిక, స్వామి, రాజు, సందీప్, వీరస్వామి, జితేందర్, తదితరులు పాల్గొన్నారు.
ధర్మసాగర్ : మండల కేంద్రంలో వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, మాజీ ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు తోట నాగరాజు సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పక్కల రవీందర్, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు గుండు రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు తాటికాయల ఆరోగ్యం, ప్రధాన కార్యదర్శి వేములకొండ కుమారస్వామి, కోశాధికారి పెసరు శ్రీనివాస్, కార్యదర్శి కొలిపాక రాజ్‌కుమార్, సహాయ కార్యదర్శులు ములుగు సాంబరాజు, రషీద్, గౌరవ అధ్యక్షులు జంగ రాములు, కందుకూరు భిక్షపతి, ముఖ్య సలహాదార్లు గుండు రమేష్, శోభనవేణి అనిల్‌కుమార్, సభ్యులు అరవింద్, యాదగిరి, సారయ్య, కనకయ్య, వెంకటమల్లు తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : వీఆర్ఏలు బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. అనంతరం వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వల్లబోజుల విష్ణు మాట్లాడారు. కార్యక్రమంలో వీఆర్ఏలు గంజి నర్సింహులు, బొంకూరి రవీందర్, గూడెల్లి కుమార్, ఏలిమి కుమారస్వామి, ఈశ్వరి, రమాదేవి, స్వాతి, జయశ్రీ, గూడెపు రమేష్, నర్మద, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : వీఆర్ఏలు సమ్మెలో భాగంగా డాక్టర్ బీఆర అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు పాండవుల మహేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోకన్వీనర్ గుర్రం తిరుపతి రాజు, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు నన్నేబోయిన సురేష్, ప్రధాన కార్యదర్శి పరికరాల మహేష్, ఉపాధ్యక్షులు సందీప్, నరేష్, రాంబాబు, సాంబయ్య, వినిత, రజిత, సారయ్య, లక్ష్మి, మమత, స్వామి, సాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ : మండల కేంద్రంలో వీఆర్ఏలు కాళీమాత అమ్మవారు సీఎం కేసీఆర్ మనసు మార్చాలని కోరుతూ పొర్లుదండాలు పెట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ కన్వీనర్ వంగేటి సత్యం మాట్లాడారు. కార్యక్రమంలో కోకన్వీనర్ జంగ శ్రీకాంత్, నాయకులు సతీష్, బోయిన మల్లయ్య, గోడల నర్సయ్య, మేడ కృష్ణమూర్తి, మాధవి, సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.
కాటారం : వీఆర్ఏలు గారేపల్లి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందింఇ నిరస తెలిపారు. తొలుత వీఆర్ఏలు డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు.
కమలాపూర్ : వీఆర్ఏల సమ్మెకు కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దూడపాక రాజేందర్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. అలాగే వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు శనిగరం భాస్కర్ మాట్లాడారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రాచపల్లి ఆనంద్, సహకార్యదర్శి గొర్రె ఆదామ్, ఒంగోలు కృష్ణవంశీ, రవి, తదితరులు పాల్గొన్నారు.