Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసిల్దార్ ఇక్బాల్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-భూపాలపల్లి
వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయ సంఘం మండల నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ఇక్బాల్‌కు అందించారు. ఈ సందర్భంగా వాల్మీకి బోయ సంఘం నాయకులు మాట్లాడారు. వాల్మీకి ఫెడరేషన్ ద్వారా ఆపిన రుణాలను తక్షణమే అందించాలని, జీఓఎంఎస్ నెంబర్ 98ని అనుసరించి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ పాలక ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నా చేర్చడం లేదన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు ఎస్టీలుగా, ఎస్సీలుగా గుర్తించబడ్డారని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వాల్మీకి బోయ కులస్తులను అక్కడి ప్రభుత్వాలు ఎస్టీలుగా గుర్తించాయని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లోని వాల్మీకి బోయలను ఎస్టీలుగా, మైదాన ప్రాంతాల్లోని వాల్మీకి బోయలను బీసీలుగాను గుర్తించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో వాల్మీకి బోయ సంఘం మండల నాయకులు బోగి భాస్కర్, బోగి సురేష్, రాజేందర్, మేకల కనకయ్య, బోగి స్వామి, రమేష్, పసుల రమేష్, సాగల కుమార్, గుజ్జుల భాస్కర్, బోగి లక్ష్మిమల్లు, ముష్కె ఐలయ్య, బోగి మల్లయ్య, బోగి విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట : వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయ కార్యచరణ కమిటీ మండల యూత్ సభ్యులు తట్ల మహేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ చలమల్ల రాజుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో కార్యాచరణ కమిటీ సభ్యులు బేరుగు ప్రశాంత్, సాంబయ్య, సతీష్, భోగి రమేష్, జుంగ శ్రీనివాస్, శ్రీకాంత్, చంద్రమోహన్, రవిచందర్, నాగరాజు, ఈజిగిరి సురేష్, లక్ష్మి పాల్గొన్నారు.
టేకుమట్ల : వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ కోరారు. ఈ మేరకు తహసీల్దార్ రామా రావుకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లా డారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల వాల్మీకి బోయ కులస్తులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ : వాల్మీకి బోయ ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బలవంతుల రాజు, గోపన్న, రవి, రాజు, శ్రీకాంత్, బోగి నాగరాజు, గోపనబోయిన రాజేందర్ పాల్గొన్నారు.