Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐబీ ఏసీ, మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం
- మండల సర్వసభ్య సమావేశంలో నిలదీత
నవతెలంగాణ-గణపురం
అధికారుల నిర్లక్ష్యం వల్లే మండల అభివృద్ధికి ఆటంకాలు తలెత్తుతునానయని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కావటి రజిత రవీందర్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా ఐబీ ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ అధికారులపై ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా మండిపడ్డారు. దీంతో సర్వసభ్య సమావేశంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్లు వేసినా మంచినీరు ప్రజలకు అందడం లేదన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ స్కీము చేపట్టగా అధికారుల నిర్లక్ష్యంతో అది నీరుగారి పోతోందని ఆందోళన వెల్బిఉచ్చారు. అనంతరం ఐబీ ఏఈ శ్రీనివాస్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాల్వలు శుభ్రం చేయలేదని, పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. వర్షాకాలంలో రైతులు వరి నాట్లు వేసేందుకు దుక్కులు దున్ని రెడీ చేసుకున్నారని, కాల్వలు శుభ్రంగా లేకపోవడంతో కాల్వల వెంట నీరు నిలిచిపోతోందని తెలిపారు. అలాగే కాల్వల కిందున్న రైతుల పంటలకు నీరు అందడం లేదన్నారు. గ్రామాల్లో కరెంటు కోతల తీవ్రత ఉందని, వర్షాకాలం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎందుకు పంచుతున్నారని తహసీల్దార్ సతీష్‌కుమార్ వైస్ ఎంపీపీ అశోక్ నిలదీశారు.