Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని చల్లగరిగకు చెందిన సీనియర్ జర్నలిస్టు తడుక సుధాకర్ శనివారం గ్లోబల్ సోషల్ వర్కర్ అవార్డు అందుకున్నారు. స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ ఇండిపెండెన్స్, ఇంటర్నేషనల్ యూత్ డే సంబరాల్లో భాగంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోనిపొట్టి శ్రీరాములు యూనివర్శిటీ ఎన్టీఆర్ కళామందిర్లో ఆయన అవార్డును అందించారు. స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరి చెన్నారెడ్డి, దేవు సాంబయ్య ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపాల్, డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, జాతీయ చేనేత మండల ఉపాధ్యక్షులు సోషల్ వర్కర్ వాసం భూమానందం, ఆంధ్ర, తెలంగాణ పోలీస్ కోచ్ శ్రీ లక్ష్మీ సామ్రాజ్యం చేతులమీదుగా సుధాకర్ ఉత్తమ అవార్డు అందుకున్నారు. చిట్యాల సీనియర్ జర్నలిస్టు, వెలుగు రిపోర్టర్ తడుక సుధాకర్ సామాజిక కోణం, మానవీయ కోణాలతో రాసిన కథనాలను పరిశీలించిన స్ఫూర్తి సర్వీస్ సొసైటీ వారు 'గ్లోబల్ సోషల్ వర్కర్' అవార్డుకు ఎంపిక చేసి, ప్రశంసాపత్రం, శాలువాతో సన్మానించారు. సుధాకర్ ప్రస్తుతం వెలుగు రిపోర్టర్‌గా కొనసాగుతున్నాడు. 23 ఏండ్లుగా ఆయన విలేకరిగా పని చేస్తూ ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకోవడం విశేషం. ఆయనకు సన్నిహితులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.