Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జీపు జాత ప్రారంభం
నవతెలంగాణ-పాలకుర్తి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయా లని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. వారోత్సవా లను పురస్కరించుకొని చేపట్టిన జీపు జాతానుమండల కేంద్రంలో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946లో మొదలై 1951 వరకు కొనసాగిందని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో నైజాం స్టేట్ విలీనం కావడం చారిత్రక వాస్తవం కావడం కీలకమన్నారు. నాడు ఉద్యమంలో సంబంధం లేని పార్టీలు, నాయకులు ప్రస్తుతం ప్రజలను వంచించేలా మోసపూరిత ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈనెల 17న జిల్లా కేంద్రంలో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, విజేందర్, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, నాయకులు సోమ సత్యం, మాసంపల్లి నాగయ్య, సోమ అశోక్ బాబు, ముస్కు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, రజక వత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదార్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లావుడ్య అనిల్ చౌహాన్, ప్రజాసంఘాల నాయకులు రాపర్తి మంజుల, లొంక అండమ్మ, ఇంటి వెంకట్ రెడ్డి, పనికిర రాజు, మచ్చపాడు సోమయ్య, కొమురయ్య, భాస్కర్, రమేష్, వెంకన్న, సీఐటీయూ నాయకులు ఏనుగుతల వెంకన్న, రాజు, సమ్మయ్య, మహబూబ్, ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.