Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ జోగినపల్లి, హీరోయిన్ కృతి శెట్టి
- హనుమకొండలో వేడుకగా ప్రారంభం
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరంగా అభివృద్ధి చెందిన, వరంగల్ ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న హనుమకొండ నగరంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చెన్నరు షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, హీరోయిన్ కృతి శెట్టి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలో ఏర్పాటు చేసిన ఆ మాల్‌ను శనివారం వారు వేడుకగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు, ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన నగరంగా హనుమకొండ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వివాహాలు, ఇతర శుభ కార్యాలయాల సందర్భంగా షాపింగ్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్, ములుగు, భూపాలపల్లి జయశంకర్, మహబూబాబాద్, జనగామ జిల్లాల ప్రజల సైతం హనుమకొండకు వస్తారని తెలిపారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన హనుమకొండ నగరంలో ప్రజలకు మరింత చేరువలోకి వస్త్ర ప్రపంచాన్ని తీసుకొచ్చేలా చెన్నరు షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అనంతరం హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడారు. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా చెన్నరు షాపింగ్ మాల్‌ను అభివర్ణించారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు మాట్లాడుతూ హన్మకొండలో తొలిసారిగా హైదరాబాద్ స్థాయిలో ఆధునిక హంగులతో సువిశాలమైన భవనంలో చెన్నరు షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. షాపింగ్ మాల్లో మహిళలకు అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ చీరలు, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్‌తోపాటు సువిశాలమైన గోల్డ్ సెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద షోరూమ్‌గా నెలకొల్పిన చెన్నరు షాపింగ్ మాల్ ద్వారా కుటుంబంలో అందరికీ వస్త్రాలతోపాటు బంగారు ఆభరణాలను అందుబాటులో ఉంచామని వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.