Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో రైతులు
నవతెలంగాణ-మల్హర్రావు
శుక్ర, శనివారాల్లో కొనసాగిన వర్షాలతో పాటు ఎల్ఎండీ గేట్ల ఎత్తివేతతతో మండలం లోని కుంభంపల్లి, పీవీ నగర్, వల్లెంకుంట, మల్లారం, తాడిచెర్ల, కొండంపేట గ్రామాల్లోని మానేరు పరివాహక ప్రాంతాల్లో వరద ఉదతికి వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీట మునిగాయి. దీంతో బాధిత రైతులు కన్నీరు మున్నీరౌతున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో మానేరు బ్యాక్‌వాటర్‌తో పొలాలు కోతకు గురై పొలాల్లో ఇసుక మెటలు పెట్టి రైతులకు వేలల్లో నష్టం జరగ్గా ప్రస్తుతం పొలాలు, పత్తి కలుపు దశలో వరద ఉదతంతో నీట మునిగాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం, వ్యవసాయ ఉన్నతాధికారులు స్పందించి నీట మునిగిన పొలాలను సర్వేలు నిర్వహించి పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
నేలకూలిన ఇల్లు
మహాదేవ్‌పూర్ : శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని కాళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇప్పలబోర్లో వద్ది చిన్నక్క ఇల్లు కూలిపోయింది. ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.