Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-రేగొండ
రాష్ట్రంలో బీజేపీ మీద ప్రజల తిరుగుబాటు షురువైందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మండలంలోని రామగుండాలపల్లి, జగ్గయ్యపేట, సుల్తాన్పూర్, వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట, గాంధీనగర్, నిజాం పల్లి, గోరికొత్తపల్లి గ్రామాల్లోని లబ్దిదారులకు కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సభ లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివద్ధిని ఓర్వలేక బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నయ నయీమ్, తుగ్లక్ల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ గుజరాత్లో రూ.750లు పింఛన్ ఇస్తుండగా తెలంగాణలో సీఎం కేసీఆర్ చొరవతో వృద్ధులకు రూ.2 వేల 16, వికలాంగులకు రూ.3 వేల 16లు అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అన్ని తరగతుల ప్రజలు ఆకర్షితులౌతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, జెడ్పీటీసీ సాయిని విజయ, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ మహేందర్, కోఆర్డినేటర్ మటిక సంతోష్, సర్పంచ్లు సంతోష్, చందు, రజిత రాజు, శ్వేత రాజు, సంతోష్, రజిత, ఎంపీటీసీలు సునీత రాజేశ్వర్రావు, కుమార్, హమీద్, స్వప్న రాంబాబు, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ సామల పాపిరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు రహీమ్, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు దాసరి నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొలుగూరి రాజేశ్వర్రావు, అమ్ముల రాజయ్య, అమ్ముల సదయ్య, తదితరులు పాల్గొన్నారు.