Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు సంపత్‌రెడ్డి
నవతెలంగాణ-జనగామ
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని జెడ్పీ చైర్మెన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ అభివద్ది చెందుతోన్న తరహాలోనే దేశం పురోగమించాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రాక తప్పదన్నారు. సీఎం కేసీఆర్ విజన్, దూరదష్టి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. నష్టాల సాకుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టిందని మండిపడ్డారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు నానాటికీ విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు జీవనం సాగించలేని దుస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రజలకు మెరుగైన పాలన అందాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటారని చెప్పారు. సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్ నాయక్, నాయకులు అందె నవీన్, బస్వగాని శ్రీనివాస్, వారాల రమేష్, గణేష్, దయాకర్, పాలకుర్తి జెడ్పీటీసీ శ్రీనివాస్, పాలకుర్తి కోఆప్షన్ సభ్యుడు మదార్, ఎంపీపీలు, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, నాయకులు బండ యాదగిరిరెడ్డి, నామాల బుచ్చయ్య, యాదగిరి, నర్సింగం, తదితరులు పాల్గొన్నారు.