Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకారెడ్డి
- ఊరూరా వర్ధంతి
నవతెలంగాణ-పాలకుర్తి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి వ్యతిరేక విధానాలపై అన్ని తరగతుల ప్రజలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ స్ఫూర్తితో పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఆమె చిత్రపటానికి, పోలీస్‌స్టేషన్ ఆవరణలో ముసుగులో ఉన్న విగ్రహంపై ముసుగు తొలగించి విగ్రహానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఏదునూరి వెంకట్రాజంతో కలిసి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో కనకారెడ్డి మాట్లాడారు. ఐలమ్మను తెలంగాణ సాయుధ పోరాట తొలితరం యోధురాలుగా తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనితగా కీర్తించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, విజేందర్, నాయకులు సోమ సత్యం, మాసంపల్లి నాగయ్య, సోమ అశోక్ బాబు, ముస్కు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, రజక వత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి మదార్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లావుడ్య అనిల్ చౌహాన్, ప్రజాసంఘాల నాయకులు రాపర్తి మంజుల, లొంక అండమ్మ, ఇంటి వెంకట్‌రెడ్డి, పనికిర రాజు, మచ్చపాడు సోమయ్య, కొమురయ్య, భాస్కర్, రమేష్, వెంకన్న, సీఐటీయూ నాయకులు ఏనుగుతల వెంకన్న, రాజు, సమ్మయ్య, మహబూబ్, ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో..
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించగా ఆమె చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా పూలమాల వేసి నివాళ్లరించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మాన్యపు భుజేందర్, జీడి సోమయ్య, అంబోజు రజిత, ఐలమ్మ వారసులు చిట్యాల యాకయ్య, రాపర్తి మంజుల పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించగా ఆమె చిత్రపటానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, సర్పంచ్ వీరమనేని యాకాంతరావు పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మదార్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముస్కు రాంబాబు, ఎంపీటీసీల ఫోరమ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు మాటూరి యాకయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ జర్పుల బాలునాయక్, సీఐ వట్టె చేరాలు, ఎస్సై తాళ్ల శ్రీకాంత్, ఐలమ్మ వారసుడు చిట్యాల సంపత్, మాజీ ఉపసర్పంచ్ కాటబత్తిని రమేష్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్టీ సెల్ నాయకుడు భూక్య శ్రీనునాయక్, వార్డు సభ్యులు గాదెపాక ఎల్లయ్య, బెల్లి యుగంధర్, గంగు నవీన్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ దయన్న దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో..
నవతెలంగాణ దయన్న దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించగా ఆమె చిత్రపటానికి సేవా సమితి ప్రధాన కార్యదర్శి మంద ఎల్లయ్య, పాలకుర్తి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల సత్యనారాయణ పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మద్దికుంట స్వామి, దిండిగళ్ల వెంకన్న, నారగాని యాకన్న, పెకటోజు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : మండలంలోని కడవెండిలో రజక వత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించగా ఆమె చిత్రపటానికి అధ్యక్షుడు పైండ్ల వెంకటనారాయణ పూలమాల వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో గ్రామ రైతు కోఆర్డినేటర్ పోతిరెడ్డి లీనారెడ్డి, ఉపసర్పంచ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ : జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బాల్నె వెంకట మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ చిత్రపటానికి ఆ పార్టీ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్, అహల్య పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పొత్కనూరి ఉపేందర్, పట్టణ కమిటీ సభ్యులు పందిళ్ల కళ్యాణి, పల్లెర్ల లలిత, శాఖ కార్యదర్శులు సిద్దిరాల ఉపేందర్, గంగరబోయిన మల్లేష్ రాజ్, భాషపాక విష్ణు, మునీర్, గుండేటి రమేష్, కోయల్‌కార్ సాయిప్రకాష్, మోకు భవానీ, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.
రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో..
రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించగా ఆమె చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు మైలారం వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కొలిపాక నర్సింహులు, నాయకులు ఉల్లెంగుల శివకుమార్, నర్సయ్య, సత్యనారాయణ, రాజు, వెంకటేశ్వర్లు, సాయిలు, ఏదునూరి సారయ్య, రాజు, సంపత్, యానంకి కొమురయ్య, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.
జనగామ కలెక్టరేట్ : జనగామ మండలంలోని చీటకోడూరులో శ్రీవీరభద్ర రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించగా ఆమె చిత్రపటానికి సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబరాజు రవి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత కరుణాకర్‌రెడ్డి, ఓరుగంటి శేఖర్, ఓరుగంటి సంతోష్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : మండల కేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తూటి దేవదానం, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యుడు గోసంగి శంకరయ్య పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు.కార్యక్రమంలో నాయకులు రాపోలు సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఐలమ్మ ధీశాలి : ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘన్పూర్ : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన ధీశాలిగా చాకలి ఐలమ్మను మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అభివర్ణించారు. తన క్యాంప్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. నిజాం పాలన నుంచి విముక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మ పాత్ర కీలకమని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ రవి, ఎంపీపీ కందుల రేఖ, మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్, మాజీ అధ్యక్షుడు గట్టు రమేష్, గుర్రపు వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ డైరెక్టర్ తోట సత్యం, యూత్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మారెపల్లి ప్రసాద్‌బాబు, సోషల్ మీడియా ఇన్‌ఛార్జి రంగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
జఫర్గడ్ : మండల కేంద్రంలో సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. మండలంలోని తమ్మడపల్లి(జి)లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యుడు కాట సుధాకర్, సీపీఐ మండల కార్యదర్శి రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యుడు ఇక్బాల్, ప్రజాసంఘాల నాయకులు ఎదులాపురం మదన్మోహన్, మాడరాజు ఆంజనేయులు, నల్లతీగల సంతోష్, కాట భాస్కర్, సంతోష్, రాజు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి రాడపక సత్తయ్య, గ్రామ కార్యదర్శి మంద బుచ్చయ్య, వెంకటయ్య, రాజయ్య, యకయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేట : సీపీఐ(ఎం) కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి ఆ పార్టీ మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లా డారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యుడు రవిందర్‌రెడ్డి, మినాలపురం ఎల్లయ్య, రామగల్ల అశోక్, సుధాకర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ : సీపీఐ(ఎం) హనుమకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి నిర్వహించగా ఆమె చిత్రపటానికి మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు మంద సంపత్ పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా కన్వీనర్ కంచర్ల కుమారస్వామి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దూడపాక రాజేందర్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నోముల కిషోర్, గొర్ల మేకల సంఘం జిల్లా నాయకులు తొట్టి మల్లేశం, మేకల రఘుపతి, చెరుపెల్లి కుమారస్వామి, పైళ్ల హరికృష్ణ, పూలమ్మ, కల్పన, రజియా, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
బహుజనుల ఆరాధ్యం ఐలమ్మ : కార్పొరేటర్ రాజు
తెలంగాణ బహుజనుల ఆరాధ్యంగా ఐలమ్మను 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు కొనియాడారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హనుమకొండ న్యూశాయంపేట చౌరస్తాలోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి కార్పొరేటర్ రాజు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం రాజు మాట్లాడారు. భూమికోసం భుక్తి కోసం వేట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ పోరాడినట్టు తెలిపారు. ఆమె స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద ఆనంద్, బస్వరాజు పెద్ద కుమారస్వామి, రజక సంఘ అధ్యక్షుడు రాంచందర్, అంకయ్య, భిక్షపతి, మల్లయ్య, మోహన్‌బాబు, సమ్మయ్య, రమేష్, ప్రశాంత్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
సుబేదారి : ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఐలమ్మ చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆచార్య బన్న ఐలయ్య పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఐనవోలు : మండలంలోని కొండపర్తిలో ఐలమ్మ చిత్రపటానికి సర్పంచ్ కట్కూరి రాజమణి బెన్సన్ నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, దర్గా సొసైటీ వైస్ చైర్మెన్ మాదాసు బాబు, వార్డు సభ్యులు నిరటి రాంబాబు, అంకూస్, రవికుమార్, సుత్రపు అజరు, స్వాతి అశోక్‌రావు, రజిత, బాబు, రజినీ వేణు, పులిగారి వెంకన్న, సమ్మిరెడ్డి, భూపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సింగారపు రాజు, గ్రామ కార్యదర్శి కొరివి లక్ష్మన్ పాల్గొన్నారు.
శాయంపేట : ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న ఐలమ్మ విగ్రహానికి బీజేపీ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చందుపట్ల కీర్తిరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. అలాగే ఆమె విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, రజక సంఘం నాయకుడలు, ఏబీఎస్ఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళ్ల ర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం రమేష్, నాయకులు మొగిలి, రామకృష్ణ, దేవరాజ్, విద్యాసాగర్, రాజు, రజక సంఘం నాయకులు జాలిగపు అశోక్, ప్రశాంత్, ఏబీఎస్ఎఫ్ నాయకుడు నరేష్ పాల్గొన్నారు.
పరకాల : స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మడికొండ శీను పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకష్ణ, వైస్ చైర్మెన్ రేగూరి జైపాల్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బొచ్చు వినరు, ఎస్ఎంసీ చైర్మెన్ సారంగపాణి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నడికూడ : మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి తెలంగాణ రజాక సంఘాల సమితి రాష్ట్ర కోకన్వీనర్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి (చందు) ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాల్లర్పించారు. కార్యక్రమం లో సర్పంచ్ రవీందర్రావు, మల్లారెడ్డి, నారగాని శ్రీనివాస్, రావుల కిషన్, సంగాని వేణు, దుప్పటి మొగిలి, పోషనపెల్లి విజరుకుమార్, తదితరులు పాల్గొన్నారు.
మహాదేవపూర్ : మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి జెడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్ పూలమాల వేసి నివాళ్లర్పించారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, రజక సంఘ నాయకులుి వెంకటయ్య, చెన్నూరు చంద్రయ్య, బోనగిరి చిన్నన్న, చంద్రగిరి వెంకటయ్య, గుండ్లపల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
మల్హర్రావు : మండలంలోని తాడిచెర్ల, వల్లెంకుంట గ్రామాల్లో రజక సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించగా నాయకులు మాట్లాడారు.