Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్
నవతెలంగాణ-ములుగు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గూగులోతు రమేష్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సాధు రాకేష్ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పి ఏడు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఈ ప్రభుత్వ విద్యార్థులను పట్టించుకోలేదన్నారు. పెండింగ్ ఉన్న ఉపకార వేత నా లు రీయింబర్స్మెట్ వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి విద్యార్థికి నెలకు రూ. 1000 పాకెట్ మనీ ప్రభుత్వం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో విద్యార్థుల అంతా దశల వారి పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్,సాయి చరణ్, ముష్రాఫ్ తది తరులు పాల్గొన్నారు.