Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలావరంగల్
యుఎస్పిసి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించే ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమి టీ సభ్యుడు పెండెం రాజు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్ పిలుపునిచ్చారు. శనివారం టీఎస్ యుటిఎఫ్ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండలం లోని పలు గురుకుల పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలను సేకరిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు ఈ దసరా సెలవుల్లో చేపట్టాల న్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, 317 జీవో అప్పి లను, స్పౌజ్, వితంతువుల అప్పిలను పరిష్క రించాలన్నారు. పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. పాఠశాలలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని, విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాల న్నారు. సెప్టెంబర్ 13న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కా ర్యక్రమంలో జిల్లా కోశాధికారి సుజన్ ప్రసాద్‌రావు, జిల్లా కార్యదర్శులు నామోజు శ్రీనివాస్, పాక శ్రీనివాస్, సి ఎస్ ఆర్ మల్లిక్, ఎంఏ రావూఫ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.