Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
పట్టుదల, పేదలపై ప్రేమ కలిగిన కెసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ప్రధానిగా అవసరమని టీఆర్ఎస్ మండల ఇంచార్జ్ తుమ్మల మల్లారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు కుడుముల లక్ష్మినా రాయణ అధ్యక్షతన జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో పేదలకు సంక్షేమం అభివద్ధి ఆత్మగౌరవముతో జీవించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. భారతదేశానికి సైతం తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా ఉండి అన్ని రాష్ట్రాల పేదలు ఆర్దికంగా నిలబడేలా చేసేందుకు కెసిఆర్ లాంటి నేత ఈ దేశానికి అవసరమని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడి ప్రభుత్వన్ని గద్దె దించే విధంగా ప్రతి తెలంగాణ బిడ్డ కెసిఆర్ తో కలిసి రావాలని కోరారు.
14 నుండి టీఆర్ఎస్ పార్టీ గామ్ర సమీక్షలు
ఈ నెల 14 నుండి 18 వరకు మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ గ్రామశాఖల ఆధ్వర్యంలో గ్రామ సమీక్షలు నిర్వహించనున్నట్లు మండల పార్టీ అద్యక్షు డు కుడుముల లక్ష్మీనారాయణ తెలిపారు. 14న, అకినేపల్లి మల్లారం, బ్రాహ్మణపల్లి, కత్తిగుడెం, దోమెడ, నిమ్మగూడెం, రామచంద్రుని పేట(సంగంపల్లి), 15న రాజుపేట, వాగొడ్డు గూడెం, రమణక్కపేట, వాడగుడెం, చుంచుపల్లి, కొత్త మాల్లురు, 16న మల్లూరు, నర్సింహాసాగర్, బాలన్నగూడెం, నర్సాయి గూడెం, బుచ్చంపేట, తిమ్మంపేట, కొత్తపేట (చెరుపల్లి), నర్సాపురంబోరు, కొత్తూరు మొట్లగూడెం, కోమ టిపల్లి, 18న, కమలాపురం, మంగపేటలలో పార్టీ నాయ కులు, కార్యకర్తలతో మండలంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అనే అంశాలపై సమీక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి రాజుయాదవ్, చిట్ిమల్ల సమ్మయ్య, గుడివాడ శ్రీహరి, నాయకులు పాల్గొన్నారు.