Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు చల్లా లింగయ్య
నవతెలంగాణ-ములుగు
పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తొల గించాలని సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షులు చల్లా లింగయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సామాజిక న్యాయవేదిక ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడుతూ పోలీసు రిక్రూట్ మెంట్బోర్డులో రాజ్యాంగ విలువలు కాపాడగలిగిన వ్యక్తిని బోర్డు చైర్మన్గా నియమిం చాలన్నారు. కార్యక్రమంలో ములుగు నియోజక వర్గం అధ్యక్షులు పోరిక సామల్నాయక్, జిల్లా కార్యదర్శికోరే రవి యాదవ్, ఎంహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు పోలేపాక యాక య్య, గౌడ సంఘ జిల్లా అధ్యక్షులు బుర్ర సుధాకర్, విద్యా వంతుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మంజూ నాయక్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
నోటిఫికేషన్లో అణగారిన వర్గాలకు అన్యాయం
తొర్రూరు : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల వారికి అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జ్ మంద యాకమల్లు ఆరోపించారు. శనివారం స్థానికంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూల్ ఆఫ్ లా ప్రకారం రిక్రూ ట్మెం ట్ నోటిఫికేషన్ ను విడుదల చేయలేదని, ఈ రిక్రూ ట్మెంట్ ను అడ్డుకోకుంటే అణగారిన కులాలకు అన్యాయం జరుగు తుందని తెలిపారు. ఈనెల 11న జరిగే నియోజక వర్గాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యేకు వినతి ప త్రం అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాదులో తలపెట్టబోయే నిరవధిక దీక్ష లో పరీక్ష రాసిన అభ్యర్థులు పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మరిపెడ : ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పాటించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. మండలం కమిటీ ఆధ్వర్యంలో అబ్బాయిపాలెం అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిన్నా లచ్చయ్య మాట్లాడుతూ ఓసీలకు 80 మార్కుల నుండి 60కి బీసీలకు 70 మార్కుల నుండి 60కి కట్ ఆఫ్ మార్కులు తగ్గించిన ప్రభుత్వం, ఎస్సీలకు మాత్రం 60 మార్కులకి 60 ఉంచడాన్ని బట్టి ఈ ప్రభుత్వం దళితుల పట్ల వివక్షత చూపుతోందని అభిప్రాయ పడ్డారు. దీంతో రిజర్వేషన్ కోల్పో యిన దాదాపు నాలుగు లక్షల మంది అభ్యర్థులు అర్హతను కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా రిజర్వేషన్ విధానం అమలు చేయాలని కోరారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కెవిపిఎస్ సీనియర్ మండల కోశాధికారి పత్తిపాటి వినరు, మండల అధ్యక్షులు టీ విజరు, మండల సహాయ కార్యదర్శి చింత వెంకటేష్, ఎం.మురళి, పి క్రాంతి కిరణ్, జై వీరభద్రి, రవికుమార్, మునేష్, పాల్గొన్నారు.