Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవో అంకిత్
నవతెలంగాణ-తాడ్వాయి
ఆశ్రమ పాఠశాల, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు హెడ్మాస్టర్లు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు వేడి వేడి పోషికరమైన ఆహార పదార్థాలు అందించాలని ఏటూర్ నాగారం ఐటిడిఎ, పిఓ అంకిత్ అన్నారు.రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ వారం రోజులపాటు స్వచ్ఛ ఆశ్రమ పాఠశాల స్పెషల్ డ్రైవ్ ప్రో గ్రాంలో భాగంగా శనివారం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్ర మ పాఠశాలలో తాడ్వాయి ఐటీడీఏ పిఓ అంకిత్ శనివారం సందర్శించారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆహారాన్ని అందించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వంట చేసే సహాయకులు సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థులకు ఆహార విషయంలో అవక తవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. అనంతరం హెచ్ఎం ఎల్ పద్మ వార్డెన్ లక్ష్మి మిగతా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ లో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే మొక్కలను నాటి పరిరక్షించడం అలవాటు చేసుకోవా లన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మి ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.