Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మరిపెడ
ఇంటి స్థలం ఉండి ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వం వారికి రూ.5 లక్షల ఇవ్వాలని సిపిఐ(ఎం) మహబూబాద్ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. సిపిఐ (ఎం) మండల విస్తతస్థాయి సమావేశం కనకదుర్గ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఇంటి స్థలం లేని పేదలకు 125 గజాల స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. పట్టణ కేంద్రంలోని 465 సర్వే నెంబర్లు లో గతంలో పేదలు ఇండ్లు వేసుకోగా వాటిని ప్రభుత్వం తొలగించిందన్నారు. అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని లేనియెడల సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో పేదలు అదే స్థలంలో గుడిసెలు వేసుకుంటారని స్పష్టం చేశారు. సమావేశంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల వాల వీరయ్య, మండల కార్యదర్శి దుండి వీర న్న, పార్టీ ఆర్గనైజర్ బాణాల రాజన్న, మండల కమిటీ నాయకులు నందిపాటి వెంకన్న, కం దాల రమేష్, గంధసిరి పుల్లయ్య, నాయకులు అల్లి శ్రీనివాస్ రెడ్డి, పుల్లూరు దేవయ్య, తదితరులు ఉన్నారు.