Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16న నియోజకవర్గ కేంద్రాల్లో..
- అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా, నియోజకవర్గస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమైక్యత వజ్రోత్సవ సంబరాల అమలుపై జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. రాష్ట్ర సమైక్యతను చాటి చెప్పేలా సీఎం కేసీఆర్ ఈనెల 16, 17, 18 తేదీల్లో వజ్రోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. 16న నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవ సంబరాలకు నియోజకవర్గంలో 20 వేల మందితో ర్యాలీలు, సంబరాల సభను నిర్వహించాలని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవ సంబరాలను అదే స్ఫూర్తితో నిర్వహించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా 16న నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే వేలాది మందితో పండగ వాతావరణాన్ని తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర సమైక్యత వాదాన్ని చాటేందుకు ఈనెల 17న రాష్ట్ర రాజధానిలో లక్షలాది మందితో వజ్రోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని, 18న జిల్లా కేంద్రాల్లో సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర సమైక్యతను చాటి చెప్పేందుకు గ్రామస్థాయిలో విస్తతంగా ప్రచారాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర సమైక్యత వజ్రోత్సవ సంబరాలను విజయవంతం చేసేందుకు విద్యార్థిని, విద్యార్థులను, ప్రజలను, డ్వాక్రా మహిళలను భాగస్వాములను చేయాలని చెప్పా రు. సమైక్య వజ్రోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచిం చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జనగామ, మహబూబాబాద్ జడ్పీ సీఈవోలు విజయలక్ష్మి, రమాదేవి, డీసీపీ సీతారాం, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, డిఆర్డిఏ పిడి గూడూరు రామ్ రెడ్డి, స్టేషన్గ న్పూర్, తొర్రూర్ ఆర్డీవోలు కష్ణవేణి, రమేష్లతోపాటు నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా కో ఆప్షన్ సభ్యులు, మార్కెట్ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎం పాల్గొన్నారు.