Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివారణ చర్యలు అవసరం..
- కె. దామోదర్‌రెడ్డి, ఏడీఏ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి : భారీ వర్షాల నేపథ్యంలో పత్తి చేన్లకు చీడపీడలు ఆశించే అవకాశాలు అధికంగా వున్నాయి. ఈ క్రమం లో భారీ వర్షాలు నిలిచిపోగానే పంటలో చీడపీడల నుండి పంటను రక్షించుకోవడానికి తీసు కోవాల్సిన చర్యలపై రైతులు అప్రమత్తంగా వుండాలని వ్యవ సాయాధికారులు చెబుతున్నారు. ఈ భారీ వర్షాలతో పత్తికి ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు తెగులు వచ్చే ప్రమాదముంది. ఈ తెగుళ్ల నుండి పత్తిని రక్షించు కోవడానికి హన్మకొండ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు కె. దామోదర్‌రెడ్డి పలు సూచనలు రైతులకు చేశారు. నల్లరేగడి నేలలు, లోతట్టు ప్రాం తాల్లో పత్తి చేన్లలో నిలిచిన నీరును వెంటనే బయ టకు పంపించి వేయాల న్నారు. చేన్లలో నీరు నిలువ వుండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. మే చివరి వారం లేదా జూన్ మొద టి వారంలో పత్తిని విత్తిన ప్రాంతాల్లో పత్తి పూత, కాత దశలో వుంది. భారీ వర్షాలతో ఈ పత్తికి ఆకుమచ్చ, కాయ కుళ్లు తెగుళ్లు సంక్రమించే ప్రమాదముంది.
ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లు
ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు తెగులు సోకినట్లయితే వర్షాలు వెలియగానే బావిస్టిన్ 1 గ్రామును 1 లీటర్ నీటిలో కలిపి లేదా కోర్బొండిజమ్, మ్యాంకోజెబ్ను కలిపి 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిగాని చేనుపై పిచికారి చేయా లని దామోదర్‌రెడ్డి సూచించారు.
జూన్ రెండోవారం, జూలై మూడో వారంలో విత్తిన పత్తి చేన్లకు వేరుకుళ్లు, కాండంకుళ్లు (ఎండు తెగులు) వచ్చే ప్రమాదముందని తెలిపారు. వర్షాలు నిలిచిపోయాక ఈ చేన్లపై కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి లేదా ప్లాంటోమైసిన్ లేదా స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి పైరుపై పిచికారి చేయాలని సూచించారు.
ఎదుగుదల లేకుంటే..
పత్తి చేను ఎదుగుదల లేకుంటే 19×19×19, లేదా మల్లీకెమ్ (13045) 1 కిలోను ఆకుమచ్చతెగులు, కాయకుళ్లు తెగులు మందులతో కలిపి పిచికారి చేయాలని లేదా 35 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ను కలిపి వేస్తే పత్తి ఎదుగుదల బాగా వుంటుందని దామోదర్‌రెడ్డి పత్తి సూచించారు.