Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తరిగొప్పుల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు భూక్యా చందూనాయక్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాతా మండలానికి ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా పాండ్యాల అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన సభకు చందూనాయక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ రాచరిక పాలన, భూస్వాముల దోపిడీ, పీడనల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేలా కమ్యూనిస్టుల సారధ్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందని చెప్పారు. ఆ పోరాటంలో కమ్యూనిస్టులు మాత్రమే ప్రజల పక్షాన నిలిచి అమరులయ్యారని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకిస్తూ ప్రజలను వంచించే యత్నం చేస్తోందని విమర్శించారు. ఆ పోరాటంలో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదని, కమ్యూనిస్టులు మాత్రమే పోరాడారని స్పష్టం చేశారు. ఈనెల 17న జిల్లా కేంద్రంలో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చుంచు విజేందర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బొట్టు శివ, జిల్లా కోశాధికారి మేకల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టుసూరి శైలజ, నాయకులు లావుడ్య అనిల్ చౌహన్, వల్లంపట్ల, తరిగొప్పుల గణేష్, తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్పూర్ : సీపీఐ(ఎం) జీపు జాతా మండలంలోని శివునిపల్లి, ఇప్పగూడెం, మీదికొండ, కొత్తపల్లి, రాఘవాపూర్, తాటికొండ, చిల్పూర్ మండలంలోని క్రిష్ణాజీగూడెంతోపాటు పలు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి మునిగెల రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, జీపు జాతా ఇన్ఛార్జి చుంచు విజేందర్, చందు, జిల్లా కమిటీ సభ్యుడు కొడెపాక యాకయ్య, ఇప్పగూడెం ఎంపీటీసీ గండి విజయలక్ష్మి, మండల కమిటీ సభ్యుడు గట్ల మల్లారెడ్డి, నాయకులు సిద్దుల సుదర్శన్, చిలుముల భాస్కర్, మంద మహేందర్, కుర్ర ఉప్పలయ్య, పోలాసు పరమేష్, దైద రాములమ్మ, గుర్రం వెంకటనర్సు, ఉమ్మగోని రాజు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి బొట్టు శివ, శ్రీనివాస్, గద్ద కుమార్, పరమేష్, చంద్రయ్య, పోలు సంపత్, భీమయ్య, నరేష్, తదితరులు పాల్గొన్నారు.