Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్‌కు యువత అండగా నిలబడాలి
- నాయకులుగా చేసే ఫ్యాక్టరీగా ఉంటా
- స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్ ఘనపూర్
యువత నిర్వీర్యంగా, మౌనంగా ఉంటే సమాజం క్షమించదని మాజీ డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ప్రతిఒక్కరూ నాయకులుగా ఎదిగి చైతన్యవంతులు కావాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గ కేంద్రంలో యూత్ నియోజకవర్గ ఇన్చార్జి మారేపల్లి ప్రసాద్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ యువగర్జన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివద్ధి సంస్థ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా జరగాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఆదిశగా దేశ యువత సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలువాలని కోరారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ, 36వేల కోట్లు, ఉచిత విద్యుత్ 10వేల కోట్లు, రైతు చనిపోతే రూ. 6లక్షలు అందిస్తూ, ఐక్యరాజ్య సమితి మెచ్చుకునే రీతిలో సీఎం కేసీఆర్ పాలన ఉంటే, మతతత్వ బిజేపి దేశంలో రైతుల నష్టం కలిగించే నల్ల చట్టాలను తెస్తే, బీజేపీ ప్రభుత్వం 750 మందిని బలి తీసుకుందన్నారు. తగతంలో వరి ధాన్యంపై, ప్రస్తుతం నూకల విషయంలో ఆంక్షలు విదిస్తున్నదని, రానున్న కాలంలో బీజేపి గడ్డి కరవడం ఖాయమని చెప్పారు అన్నారు. రాష్ట్రంలో 18లక్షల దళిత కుటుంబాలకు రాబోయే 5ఏండ్ల కాలంలో దళిత బంధు అందించి, సమగ్రంగా అభివద్ధి పరచడమే సీఎం లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం పేరిట లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ, పూట గదుపుతుందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీల, మైనార్టీల పట్టించుకోకుండా, సోషల్ మీడియాపై బ్రతుకుందని మండిపడ్డారు. అక్కరకు రాని వెధవలు తనను టార్గెట్ చేస్తూ, అసత్య ప్రచారం చేస్తూన్నారని ఓ బీజేపీ స్థానిక నాయకుడిని ఉద్దేశించి అన్నారు. టీఆర్ఎస్ అంటేనే తాంటికొండ రాజయ్య స్టేషన్ ఘనపూర్ గా మార్చుకున్నానని, ఎవరెందరూ అడ్డుపడ్డా, దళిత కుటుంబాలకు అభ్యున్నతికి 15వందల దళిత బంధు, 3లక్షల వ్యయపు ఇండ్లనిర్మాణం, యువకుల చేతిలో పెడ్తు న్నానని అన్నారు. రాష్ట్రాన్ని అభాసుపాలు చేస్తూ, ప్రజలికిచ్చే ఉచితాలను తొలగించండని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రాణాలు అడ్డుపెట్టైనాసరే, నమ్మిన వారిని నాయకులుగా తీర్చిదిద్ది ఫ్యాక్టరీ గా తీర్చిదిద్దుతానని అన్నారు. కష్టాలు, నిందలు, విమర్శలు ఎక్కువగా వస్తేనే ప్రజానాయకుడిగా గురర్తింపు వస్తోందని అన్నారు. తనపై కేసీఆర్ కు ఎంతో అభిమానమని అన్నారు. త్వరలోనే మహిళా సమ్మేళనం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రవి, ఎంపిపిలు రేఖ, బొమ్మిశెట్టి సరితా బాలరాజు, చిట్ల జయశ్రీ, జెడ్పీటీసీలు బొల్లం అజరు, ఇల్లందుల బేబీ, చాడ సరిత, జిల్లా నాయకులు ఆకుల కుమార్, సేవెల్లి సపంత్, పోలేపల్లి రంజిత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ ఛైర్మన్ చందర్ రెడ్డి, డైరెక్టర్లు సరిత, పెంతల రాజ్ కుమార్, మహిళా నాయకులు మడ్లపల్లి సునీత, రమాదేవి, మండల అధ్యక్షులు మాచర్ల గణేష్, వారాల రమేష్, సోషల్ మీడియా ఇంచార్జీ రంగు రమేష్, గుండె మల్లేశం, రంగు హరీష్, చేతన్ కుమార్, బొంకూరి మహేష్, మాటూరి భరత్ గౌడ్, జోగు కుమార్, నరేష్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.