Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సమన్వయ అధికారి ఉమా మహేశ్వరి
- ముగిసిన స్వచ్ఛ గురుకుల్
నవతెలంగాణ-కాజీపేట
విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని టీఎస్డబ్ల్యూఆర్ స్కూల్, కాలేజీ ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా సమన్వయ అధికారి ఉమా మహేశ్వరి కోరారు. మడికొండలోని ఆ గురుకుల పాఠశాల, కళాశాలలో చేపట్టిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఉమా మహేశ్వరి మాట్లాడారు. కార్యక్రమ నిర్వహణతో పాఠశాల, కళాశాల పూర్తి స్థాయి లో మరింత ఆహ్లాదంగా మారిందన్నారు. విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపడానికి కార్యక్రమం దోహదపడిందని చెప్పారు. ప్రతిఒక్కరూ శుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు పరిసరాల శుభ్రత, హరితహారం, తదితరాలపై నాటక, నత్య ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాలుర పాఠశాల, కళాశాలలో..
మడికొండలోని టీఎస్డబ్ల్యూఆర్ బాయ్స్ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన స్వచ్ఛ గురుకుల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక హైస్కూల్ హెచ్ఎం సంధ్యారాణి, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శంకరయ్య, జబర్దస్త్ కళాకారుడు వెంకీ హాజరై మాట్లాడారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ యూవీ చారి, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ కేవీ లక్ష్మీ, రమణ, అధ్యాపకులు పాల్గొన్నారు.