Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-హసన్పర్తి
నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా హసన్ పర్తి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో పాల్గొనీ ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని వసతులతో కూడిన కేజీ నుండి పీజీ వరకు విద్యను అందిస్తుందన్నారు. మొన్న 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్నమన్నారు. నేడు స్వచ్చ గురుకుల్ కార్యక్రమం తీసుకుని ఇందులో విద్యార్థులను భాగస్వాములను చేయడం చాలా సంతోషకరంలమన్నారు. మనతో పాటు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తరగతి, వసతి గదులను, కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఎమ్మెల్యే ముందుగా కళాశాల అవరణలో మొక్కను నాటి, జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ గురుకుల్ యొక్క ప్రతిజ్ఞను విద్యార్థులతో కలిసి చేశారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.