Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-నడికూడ
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో రూ.9.21 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంఖుస్థాపన, ప్రారంభం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త లబ్దిదారులకు ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ఏ రాష్ట్రంలో ఏ సీఎం అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ దేశం గర్వించదగిన నాయకుడిగా ప్రజల మదిలో నిలిచిపోయారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ రాజేందర్, ఎంపీపీ మచ్చా అనసూర్య రవీందర్, జడ్పిటిసి కోడపాక సుమలత కరుణాకర్, వైస్ ఎంపీపీ చంద కుమారస్వామి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మార్కెట్ చైర్మన్, కమిటీ సభ్యులు, రైతుబంధు సమీతీ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
పల్లె దవాఖానా ప్రారంభం
మండలంలోని నార్లాపూర్‌లో రూ.16 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను, రూ.20 లక్షలతో వేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో లబ్దిదారులకు ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్, జెడ్పిటిసి కొడపాక సుమలత కరుణాకర్, సర్పంచ్ నీల సమ్మయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురుశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతిరెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.