Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వన్ షాపింగ్ మాల్' ప్రారంభం
- మంత్రి ఎర్రబెల్లి, టాలీవుడ్ సెలబ్రిటీ కాజల్ అగర్వాల్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
ప్రత్యేకమైన కుటుంబ షాపింగ్ మాల్, ప్రతిరోజూ సరికొత్త అనుభవాన్ని అందించే సరికొత్త సంచలనాత్మక షాపింగ్ అనుభవం. వన్ షాపింగ్ మాల్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. సెలబ్రిటీ అతిథి, టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. దేశంలోని ఈ ప్రాంతంలోనే అతిపెద్ద మాల్స్‌లో ఇది ఒకటి కావడం విశేషం. వన్ షాపింగ్ మాల్ 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కస్టమర్లు మొత్తం కుటుంబం కోసం అందుబాటులో ఉన్న విస్త్రత వస్త్ర శ్రేణి నుంచి ఎంపిక చేసుకోవచ్చు. వన్ షాపింగ్ మాల్ చైర్మెన్ నమశివాయ వస్త్ర పరిశ్రమలో అపారమైన ఖ్యాతిని కలిగి ఉన్నారు. అంతేకాకుండా నాణ్యమైన వస్త్రాలను అత్యంత సరసమైన ధరలకు అందించడం ద్వారా అపారమైన కస్టమర్ ఆదరాభిమానాలను పొందుతున్నారు. మాల్లో అందరి కోసం ఎంపిక చేసిన విస్త్రత కలెక్షన్లు ఉన్నాయి. మహిళలకు అనేక రకాల చీరలు, లెహంగాలు, వెస్ట్రన్ వేర్, వెడ్డింగ్ వేర్, డ్రెస్ మెటీరియల్స్ మరియు మరెన్నో ఉన్నాయి. పిల్లలు మరియు యువతుల కోసం పార్టీ దుస్తులు, పండుగ దుస్తులు, రోజువారీ దుస్తులు, ఫ్యాన్సీ చీరలు, డిజ్కెనర్ దుస్తులు, కేటలాగ్ చీరలు, పట్టు పెళ్లి దుస్తులు, కాంచీపురం పట్టు చీరలు, ఉప్పాడ చీరలు, హై-ఫ్యాన్సీ చీరలు, సల్వార్లు, కుర్తా పైజామాలు మరియు అవసరమైన ప్రతిదాని నుండి ఎంచుకోవచ్చు. పురుషులు అధునాతన ధోతీలు, కుర్తీలు, షర్టులు, టీ-షర్టులు, ప్యాంటు, జీన్స్, వివాహ దుస్తులు, పండుగ దుస్తులు మరియు మరెన్నో తాజా వస్త్ర శ్రేణి అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ హన్మకొండలో వన్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించడం ఒక మహత్తరమైన సందర్భమన్నారు. సువిశాలమైన, అతిపెద్ద మాల్ పట్టణంలో ఒక మైలురాయి అవుతుందని, కుటుంబమంతటికీ అభిరుచులకు తగినట్లుగా ఇక్కడ ఒకే చోట లభిస్తాయని తెలిపారు. వివాహాలకు, మహిళలు, పురుషులు మరియు పిల్లల కోసం విస్తతమైన వస్త్రాలు మరియు డిజ్కెన్లు వన్ షాపింగ్ మాల్ లో అందుబాటులో ఉన్నాయని, వాస్తవానికి ఇది అందరికీ గొప్ప స్టయిల్ ఆప్షన్లను అందించే పూర్తి ఫ్యామిలీ స్టోర్ అన్నారు. వన్ షాపింగ్ మాల్ అనేక అంతస్తులలో విశాలంగా విస్తరించి ఉంది మరియు సరికొత్త డిజ్కెన్లు, ఎంపికలతో అన్ని వయసుల వారికి పూర్తి స్థాయి దుస్తులను అందిస్తున్నదని, మంచి సేవతో, నాణ్యమైన దుస్తులు మరియు అందుబాటు ధరల వంటి ఖ్యాతితో కస్టమర్లను ఇక్కడికి వచ్చేలా ప్రోత్సహిస్తుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. మాల్ పట్టణంలోనే అన్ని స్టయిలింగ్ అవసరాలను తీరుస్తుందని తెలిపారు. రెడీమేడ్స్, పట్టు చీరలు, జీరో నుండి వంద సైజు వరకు ఎత్నిక్ వేర్ మరియు హైదరాబాద్‌లో లభించేవన్నీ ఇప్పుడు ఇక్కడ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. వన్ షాపింగ్ మాల్ అందుబాటు ధరలకే అన్ని రకాల వస్త్ర శ్రేణిని అందిస్తుంది మరియు మీరు ఈ ధరలకు మరెక్కడా ఇంత నాణ్యమైనవి పొందలేరు, మా వద్ద ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి అని కాసం నమశివాయ తెలిపారు. కార్యక్రమానికి గౌరవ అతిధులుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితెల లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వొడితెల సతీష్, గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, బస్వరాజు సారయ్య, కుడా చైర్మెన్ సుందర్ రాజ్, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మెన్ బొల్లం సంపత్‌కుమార్, టీవీసీసీ చైర్మెన్ వాసుదేవరెడ్డి, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మెన్ నాగుల వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీనా మసూద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్నెన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్ చెన్నం మధు, తదితరులు పాల్గొన్నారు.