Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
సీఎం కేసీఆర్ దళితబంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ అనుబంధ దళితమోర్చా మండల అధ్యక్షుడు రత్న రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా రవి పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత దళితుడినే సీఎం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ తదనంతరం విస్మరించాడని విమర్శించారు. సీఎం అయ్యాక దళితులను ఓటుబ్యాంకుగా మాత్రమే పరిగణిస్తూ నిరంతరం మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళితబంధు పథకాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ దళితులకు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. బీజేపీ బలోపేతానికి పాటు పడాలని కోరారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు, శ్రీపెల్లి అనిల్,ఉపాధ్యక్షుడు గజనాల రవీందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రాయని శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు అనుపమ, మహేష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు శ్రీకాంత్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి వల్లాల ప్రవీణ్, బూత్ అధ్యక్షుడు చింతల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.