Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న రైతులు
నవతెలంగాణ-దంతాలపల్లి
మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పత్తి పంట ఎదగడం లేదు. దీం తో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపో తుంది. ఈ కారణంగా పత్తి రైతు కుదేలు అవుతున్నాడు. సమయానుకులంగా వర్షా లు కురవకపోవడంతో పంట దిగుబడిపై రైతులు ఆశలు సన్నగిల్లుతున్నాయి. వ్యవ సాయాన్ని నమ్ముకున్న రైతులు పత్తి సాగు చేస్తూ పెట్టిన పెట్టుబడైన చేతికి వచ్చేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన పెట్టుబడి
మండలంలో 85 శాతం మంది ప్రజ లు జీవనధారం వ్యవసాయం ఖరీఫ్ లో భాగంగా మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలు సాగు చేశారు. మండలంలో 8500 మంది రైతులు ఉన్నారు. అత్యధి కంగా 10వేలు ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు.20 ఎకరాల్లో మొక్కజొన్న,7 వేలు ఎకరాల పత్తి పంటను సాగు చేశారు. చేను చదును మొదలుకొని పత్తి విత్తనం వేయడం, కలుపు తీయడం మందులు పిచి కారి చేయడంతో పాటు పత్తి తీయ డానికి కూలీలను పెడుతున్నారు సుమారుగా ఎకరం పత్తి సాగుకు రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతుందని రైతులు చెబు తు న్నారు. పెట్టుబడి పై దెబ్బ పడు తుం దని ఆందోళన చెందుతున్నారు. వేలకు వే లు పెట్టుబడి పెట్టి తీరా పత్తి చేతి కి వచ్చే సమయంలో దిగుబడులు పూర్తిగా తగ్గి పో యాయని ఆవేదన చెందుతున్నారు. గతం లో ఎకరాకు 10 నుంచి 15 క్విం టా ల ప త్తి వచ్చేదని, ప్రస్తుతం ఒకటి రెండు క్విం టాల మాత్రమే వస్తుందన్నారు.
రెక్కల కష్టంతోనే
నిత్యం వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు దిగుబడి తక్కువ రానుందని చాలామంది రైతులు వలస వెళుతున్నారు. ఉన్న భూమిలో సాగు చేసుకుని రెక్కల క ష్టం పై బతుకుదాం అనుకున్న కాలం సరి గా కనికరించడం లేదని వాపోతున్నారు. వేసిన పంటకు పురుగులు, తెగుళ్లు ఆశిస్తూ నష్టం వాటిల్లుతుందని దిగులు చెందుతు న్నారు. దిగుబడి తగ్గిన కనీసం మద్దతు ధర కేటాయించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
పెట్టుబడి రాని పరిస్థితి
- చిల్ల బాలరాజు
మూడు ఎకరం పత్తి పంట వేసిన విత్తనాలు ఎరువులు కలుపు కూలీలకు ఇప్పటి వరకు 40 వేలు ఖర్చు అయ్యాయి. వర్షాలకు పంట ఎదగడం లేదు పెట్టుబడి ఎక్కువైనా దిగుబడి మాత్రం రావ డం లేదు. పత్తి పంటతో కష్టాలు అన్ని తీరుతాయి అనుకుంటే రెట్టింపు అయ్యాయి. వర్షాల కారణంగా దెబ్బతినడంతో పూర్తిగా మొక్కలు నల్ల బారి పోతున్నాయి. దీంతో పెట్టుబడి రాణి దుస్థితి.