Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల గైర్హాజర్
- అధికారుల తీరుపై ప్రజాప్రతినిధుల అసంతృప్తి
- హాజరుకానీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ్యుల డిమాండ్
నవతెలంగాణ-పర్వతగిరి
మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, దీనికి తోడు ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. దీంతో సభా సమావేశాన్ని తూతూ మంత్రంగా మధ్యలోనే ముగించారు. సమావేశంలో ముందుగా సభలో అధికా రులు తమ పనితీరును, పలు నివేదికల ప్రకారం చదివి వినిపించారు. దీనికి ప్రజాప్రతినిధులు అధికారుల పని తీరుపై తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారి సభ ఏర్పాటు చేసినా అధికారులకు ముందుగానే సమాచారం అందించినప్పటికి పూర్తి స్థాయిలో అధికారులు గైర్హాజరు కావడంతో సమావేశం పస లేకుండా పోతుంది. ప్రధా నంగా రోడ్డు భవనాల శాఖ, శిశు సంక్షేమ శాఖ, హార్టికల్చర్, ఉద్యాన శాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యుత్ శాఖ,ఆరోగ్య శాఖ నుం డి సైతం సమావేశాలకు అధికారులు గైర్హాజర్ అవు తున్న ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమ ర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. మండలంలో అభివృద్ధి పనులు, ఎలా జరుగుతున్నాయనే తీరుపై అధికారులు ఏ మాత్రం ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదని అనుకుంటున్నారు. ప్రజలకు అభివద్ధి కార్యక్రమాలు,ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవే యడంలో పూర్తిగా విఫల మవుతున్నారని మండల ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చర్చించు కుంటు న్నారు. ఇలా అధికారుల పనితీరు పై ప్రజాప్ర తినిధులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు న్నారని సర్పంచ్ లు, ఎంపిటిసిలు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు స్పందించి గైర్హాజరైన అధికా రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ సర్వర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, స్థానిక సర్పంచ్ చింతపట్ల మాలతి, ఎంపిటిసి మాడుగుల రాజు, అధికారులు పాల్గొన్నారు.